Homeవార్తలుతెలంగాణబంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

న్యూస్ తెలుగు/వనపర్తి : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను బుధవారం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగవరం గ్రామ శివారులోని సేవా లాల్ బంజారా భవన్ లో సాంప్రదాయ బద్ధంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల ఉన్న తాండాల నుండి గిరిజనులు హాజరు కాగా లంబాడి మహిళలు తమ సాంప్రదాయ దుస్తులతో వేడుకలకు హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ (హోమం) కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి, కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని ప్రార్థించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదని, అబద్ధం మాట్లాడవద్దు, దొంగతనాలు చేయవద్దు, మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని చెప్పారు. శాసన సభ్యులు మేఘా రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. వనపర్తి నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు. దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పి. సీతారాం నాయక్, గిరిజన అభివృద్ధి అధికారి అధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.(Story : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!