Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర 08 వ మహాసభను జయప్రదం చేయండి..

ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర 08 వ మహాసభను జయప్రదం చేయండి..

ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర 08 వ మహాసభను జయప్రదం చేయండి..

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 8 వ రాష్ట్ర మహాసభ ఈనెల 28వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ పట్టణంలోని వివి సుబ్బారావు ప్రాంగణం, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందరూ హాజరుకావాలని గౌరవ సలహాదారు కే హనుమయ్య పిలుపునిచ్చారు. స్థానిక ఎన్ఎంయు కార్యాలయంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డా. గోపు చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో గౌరవ సలహాదారు కే హనుమయ్య మాట్లాడుతూ. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ వారికి అందాల్సిన పథకాలు కోసం, బకాయిల కోసం, యాజమాన్యంతో సంప్రదింపులు, వినతి పత్రాలు, ఉద్యమాలు కొనసాగించింది. ముఖ్యమైన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ తన భార్య ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెలింగ్ చేసేందుకు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఒప్పించి సాధించిన ఘనత అసోసియేషన్ కు దక్కుతుందన్నారు. అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగితో పాటు తన భార్య కు కూడా ఉచిత ప్రయాణం బస్సు పాస్ ఇవ్వాలని, గ్రాట్యూటీ లీవ్ ఎన్కాష్మెంట్ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలి మరియు హయ్యర్ పెన్షన్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, హైదరాబాద్ బర్కత్ పురా నుండి పిఎఫ్ ఆఫీసును విజయవాడకు తీసుకురావాలని అందుకు ఆర్టీసీ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. సెక్రటరీ వి. ఆనందం మాట్లాడుతూ. రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ కి తాను చేసిన క్యాజువల్ కాంట్రాక్టు కాలానికి సంబంధించి గ్రాడ్యుటి చెల్లించాలి, మినహాయించిన పిఎఫ్ మొత్తాలను రిటైర్డ్ అయిన రోజునే చెల్లించాలి, రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఎంప్లాయ్ వృద్ధాప్యంలో కనీస జీవనం సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న సామాజిక పెన్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించాలి మరియు హయ్యర్ పెన్షన్ కోసం అర్జీలు పెట్టే డీడీలు కొట్టడంలో మిస్ అయినవారికి మరొక అవకాశాన్ని కల్పించాలని అన్నారు. అదేవిధంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ మరణించినప్పుడు ఇచ్చే 25 వేల రూపాయలు మట్టి ఖర్చులు వారి భార్యలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్కే సైదా, ట్రెజరర్ టి.ఏనుకు, కే మస్తాన్, చిన్న బాలిరెడ్డి, ఎం వెంకటేశ్వరరావు, ఎం రామసుబ్బయ్య,జి.ఉపేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.(Story : ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర 08 వ మహాసభను జయప్రదం చేయండి.. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!