Home వార్తలు తెలంగాణ సిపిఐ కి ఒక కో ఆప్సన్ మెంబరు అవకాశం ఇవ్వాలి

సిపిఐ కి ఒక కో ఆప్సన్ మెంబరు అవకాశం ఇవ్వాలి

0

సిపిఐ కి ఒక కో ఆప్సన్ మెంబరు అవకాశం ఇవ్వాలి

న్యూస్ తెలుగు/పెబ్బేరు : ఎన్నికల పొత్తులో భాగంగా పెబ్బేరు మున్సిపాలిటీల్లో కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ కి ఒక కో ఆప్సన్ మెంబరు ఇవ్వాలని సిపిఐ నాయకులు బి శ్రీనివాసులు , శాంతమూర్తీ కోరారు. మంగళవారం బ్లాకు కాంగ్రెస్ అధ్యక్షులు, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్‌ అక్కి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి కోరారు. తెలంగాణ రాష్ట్రం తో 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పాత్రలు ఎన్నికలు పొత్తులు కొన సాగుతున్నాయి గతం తో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా మిత్ర పక్షంగా సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి పని చేయడం జరిగింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి మద్దతు ఇవ్వటం మునిసిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు గా పని చేయడం జరిగింది అని పొత్తులో భాగంగా పెబ్బేరు మున్సిపాలిటీల్లో ఒక కో ఆప్సన్ స్థానాన్ని సానుకులంగా స్పందించి అవకాశం ఇవ్వాలని కోరారు. పెబ్బేరు మున్సిపల్ చైర్మన్‌ అక్కి శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి ను సిపిఐ ఏఐటీయూసీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు గాంధీ రాముడు పెద్దమన్యం మొగిలాయి రాజు తదితరులు పాల్గొన్నారు.(Story : సిపిఐ కి ఒక కో ఆప్సన్ మెంబరు అవకాశం ఇవ్వాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version