ప్రకాశం జిల్లా పాకలగ్రామంలో నిర్వహిస్తున్న “బీచ్ ఫెస్టివల్” లో LK ట్రస్ట్ వైద్య శిబిరం
న్యూస్ తెలుగు/సింగరాయకొండ : పేద,మధ్య తరగతి ప్రజల అనారోగ్యాని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు సబ్సిడీపై కంటి అద్దాల పంపిణీ మరియు మందుల పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అందుకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు మండలాలలో L.K ట్రస్ట్ ఫీల్డ్ ఆఫీసర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ చైతన్య కిరణ్ గారు తెలియచేశారు. ఫెస్టివల్ కు వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ కె అనిల్ కుమార్ గారు. LK ట్రస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. శ్రీనివాసరావు గారు. సిబ్బంది నాగమణి గారు, సుభాషిణి గారు, దివ్య గారు, మస్తానమ్మ గారు, శేషమ్మ గారు ఇతర ప్రభుత్వ అధికారిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రకాశం జిల్లా పాకలగ్రామంలో నిర్వహిస్తున్న “బీచ్ ఫెస్టివల్” లో LK ట్రస్ట్ వైద్య శిబిరం )
