Home వార్తలు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాస, ధ్యాసగా సాగిన కె.సి.ఆర్ పోరాటం

తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాస, ధ్యాసగా సాగిన కె.సి.ఆర్ పోరాటం

0

తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాస, ధ్యాసగా సాగిన కె.సి.ఆర్ పోరాటం

న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ జాతిపిత 72వ ముందస్తు జన్మదిన వేడుకలు పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి,కౌన్సిలర్స్ శ్రీకర్ గౌడ్,మురళీ సాగర్,అయేషా సిద్ధిఖీ,మాట్లాడుతూ 14ఏండ్ల ప్రజాస్వామ్య ఉద్యమం సాగించి 10ఏండ్ల సుపరిపాలన సాగించిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అని కొనియాడారు. దేశ చరిత్రలో సంక్షేమ పథకాలు రైతు బంధు,ఆసరా పింఛన్లు ,కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు,కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్,బతుకమ్మ పండుగ చీరలు,దళిత బంధు దేశ రాజకీయాలలో సంచలన సృష్టించాయని అన్నారు.కె.సి.ఆర్ గారికి ముందు ,కె.సి.ఆర్ తర్వాత అన్న విధంగా అభివృద్ధి సాగిందని కోటి ఎకరాలకు సాగు నీళ్లు అందించి రైతు భాందవుడుగా పేరుతెచ్చుకున్నారని జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజల పరిపాల సౌలభ్యం కల్పించారని అందుకే ప్రజలు మళ్ళీ కె.సి.ఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమములో జాతృ నాయక్,గులాం ఖాదర్ ఖాన్,నాగన్న యాదవ్,హేమంత్ ముదిరాజ్,సునీల్ వాల్మీకి,నీలస్వామి, జోహెబ్ హుస్సేన్,నందిమల్ల. రమేష్, వెంకట్ సాగర్,బొబ్బిలి.ప్రేమ్ కుమార్ గౌస్,గంధం.విజయ్,హరీఫ్,ఫజల్, చిట్యాల.రాము, గాలి గల్ల క్రాంతి కుమార్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,ముని కుమార్,శిరీవాటి.శంకర్, మెకానిక్.శ్రీనివాసులు,ఉందేకోటి.శివ,పోతులపల్లి.రాజు,చిలుక.సత్యం,బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.(Story : తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాస, ధ్యాసగా సాగిన కె.సి.ఆర్ పోరాటం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version