కొత్తగూడెం మేయర్ చైర్మన్ పదవి కైవసంపై సంబరాలు
న్యూస్ తెలుగు/వనపర్తి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని సిపిఐ దక్కించుకోవడంపై వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ లో సాయంత్రం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులో 15 డివిజన్లు,వైస్ చైర్మన్ పదవి కోరితే ఇవ్వకుండా నిరాకరించి రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు అవమానించారన్నారు. చాలెంజ్ గా తీసుకొని సొంతంగా పోటీ చేసి 22 డివిజన్లో గెలవటమే గాక ఏకంగా మేయర్ స్థానాన్ని దక్కించుకొని సిపిఐ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అన్నారు. సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా 42 కౌన్సిలర్ డివిజన్ స్థానాలను దక్కించుకొని కమ్యూనిస్టులకు కాలం చెల్లిందనేవారికి సవాల్ విసిరిందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో కోట్ల రూపాయల కుమ్మరించి ప్రలోభాలు పెట్టిన లొంగకుండా సిపిఐ ఎర్రజెండా బిడ్డలకు ఓటేసి గెలిపించిన కొత్తగూడెం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పొత్తులో సీట్లు అడిగితే నిరాకరించిన కాంగ్రెస్ సత్తా చాటాక అధికారం కోసం సిపిఐ తో పొత్తుకు ముందుకు వచ్చింది అన్నారు. సిపిఐ తోక పార్టీ అని మాట్లాడిన బిఆర్ఎస్ నేతలు మేయర్ పదవికి పోటీలో ఉంటే మద్దతు ఇస్తామని ముందుకు రావడం సిపిఐ సత్తాకు నిదర్శనం అన్నారు. కొత్తగూడెం విజయం స్ఫూర్తితో రాష్ట్రంలో జిల్లాలో బలాన్ని పెంచుకొని రానున్న ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలన్నారు సీనియర్ నేత మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్ సిపిఐ నేతలు రమణ, శేఖర్ ,శివ, విజయుడు, ఎన్ఎఫ్ఐ డబ్యు పట్టణ కార్యదర్శి జయమ్మ, ఏఐపీఎస్ఓ జిల్లా కన్వీనర్ శివ, వెంకటమ్మ,రూప, జ్యోతి, గాయత్రి, సుప్రియ, విజయలక్ష్మి,శాన్వి తదితరులు పాల్గొన్నారు.(Story : కొత్తగూడెం మేయర్ చైర్మన్ పదవి కైవసంపై సంబరాలు )

