క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపు
న్యూస్ తెలుగు/వనపర్తి : క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చునని, మానసికోల్లాసం తో పాటు, దేహదారుఢ్యం సమకూరుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గోపాల్పేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి CM క్రికెట్ క్రీడా పోటీలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు ఎంతో ప్రాధాన్యత నిస్తోందని, క్రీడాకారులు ఈ సదా వకాశాన్ని వినియోగించుకుని గొప్ప క్రీడాకారులుగా పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే జింకను, 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే పులి వేటాడి చంపుకుని తింటుందని.జింక భయంతో వెనకకు చూస్తూ పరిగెత్తుతుండడంతో పులి సులభంగా జింకను పట్టుకుంటుందని విద్యార్థులు కూడా వారి లక్ష్యాన్ని నిర్ధారించుకొని ప్రత్యర్థులు ఎంత సమర్ధులైన మీరు కూడా పులిలా లక్ష్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.(Story : క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపు )

