స్థానిక నూజెండ్ల రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు మరమ్మత్తు పనులు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక నూజెండ్ల రైల్వే బ్రిడ్జి కింద వాహనాలు వెళ్లే అండర్ గ్రౌండ్ రోడ్డు అద్వాన్నంగా మారి నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలగటంతో మున్సిపల్ అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. బ్రిడ్జి కింద సిమెంట్ రోడ్ అంతా లేచిపోయి గోతులు ఏర్పడి, మురుగు నీరు అంతా నిలిచిపోతుంది. ఇక వర్షం కురిసిన సమయంలో పెద్ద పెద్ద కుంటలుగా మారి వాహనాలు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు పనులు చేపట్టారు.(Story : స్థానిక నూజెండ్ల రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు మరమ్మత్తు పనులు. )

