ఇసుక, మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
న్యూస్ తెలుగు/వినుకొండ : నియోజకవర్గ పరిధిలో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కల్టెరుతో జీవి ఆంజనేయులు ఫోన్ లో మాట్లాడారు. ఇసుక, మట్టి అ క్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వనరులు కాపాడటంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలుతీసుకోవాలని జీవి ఆంజనేయులు అధికారులకు సూచించారు. కాగా జీవి ఆంజనేయులు విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్. మైనింగ్, రెవిన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అక్రమ రవాణాకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.(Story : ఇసుక, మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు )

