బీఆర్ఎస్ బిజెపిలకు ఓటు వేయడం వృధా
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిలకు ఓటు వేస్తే వృధా, అధికార కాంగ్రెస్కు ప్రజలు ఓటేసి అభివృద్ధి కి సహకరించాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో ఐదో వార్డ్ అభ్యర్థి బాపనపల్లి వెంకటేష్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్కు చెందిన మెగా రెడ్డి గెలిచారని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిలర్లు నిధులు తెచ్చి వార్డులను అభివృద్ధి చేస్తారన్నారు. వనపర్తి మున్సిపల్ లో కాంగ్రెస్ గెలిపిస్తే కౌన్సిలర్లను సీఎం దగ్గరికి తీసుకెళ్లి పట్టణ అభివృద్ధికి రూ. 400 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారని గుర్తు చేశారు. చాలా వార్డుల్లో సీసీ రోడ్లు మురికి కాలువలు లేవని, కొన్నిచోట్ల మంచినీటి ఇబ్బంది కూడా ఉందన్నారు. టిఆర్ఎస్ బిజెపిలు రాష్ట్రంలో అధికారంలో లేవని వారికి వేస్తే మన విలువైన ఓ టు వృధా అవుతుందన్నారు. 33 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఐ నేతలు శ్రీనివాసులు చిన్న కురుమన్న శేఖర్ ఎర్రకురుమన్న వంశీ రాంబాబు రాజు తదితరులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.(Story : బీఆర్ఎస్ బిజెపిలకు ఓటు వేయడం వృధా )

