Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ చెందిన కేసానపల్లి సుబ్బారావు కు వివాహ ఆచారాల కేటగిరీ లో సర్టిఫికెట్…

వినుకొండ చెందిన కేసానపల్లి సుబ్బారావు కు వివాహ ఆచారాల కేటగిరీ లో సర్టిఫికెట్…

0

వినుకొండ చెందిన కేసానపల్లి సుబ్బారావు కు వివాహ ఆచారాల కేటగిరీ లో సర్టిఫికెట్…

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణానికి చెందిన కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరీ లో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డ్ అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 లో భాగం గా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ వారు నిర్వహించిన పోటీలలో “వెడ్డింగ్ మూమెంట్స్” ఫోటోకు అవార్డ్ దక్కింది. ఆంధ్రా,తెలంగాణ లతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ లు పోటీలో పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 అవార్డ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ఇండియన్ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ సి ఆర్ సత్యనారాయణ, ఎస్ ఏ పి చైర్మెన్ ఎం సి శేఖర్ , ఎడిట్ పాయింట్ రమేష్, అభిమన్యు చేతులమీదుగా అవార్డ్ , సర్టిఫికెట్ అందుకున్నారు. అవార్డ్ అందుకున్న కేసానపల్లి సుబ్బారావు ను పల్నాడు జిల్లా, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ బి కె, వినుకొండ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు, బ్రహ్మం, వెంకటేష్, పెద్ద మల్లయ్య, శ్రీకాంత్, సి. పి,.కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు.(Story : వినుకొండ చెందిన కేసానపల్లి సుబ్బారావు కు వివాహ ఆచారాల కేటగిరీ లో సర్టిఫికెట్… )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version