Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ ల వినియోగం, భూసార పరీక్షలపై ముగిసిన శిక్షణ

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ ల వినియోగం, భూసార పరీక్షలపై ముగిసిన శిక్షణ

0

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ ల వినియోగం, భూసార పరీక్షలపై ముగిసిన శిక్షణ

న్యూస్ తెలుగు /చింతూరు : ప్రధానమంత్రి ఉచ్చితార్ అభియాన్ (పి యం ఉష) ఆర్థిక సహకారంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమండ్రి ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ సంయుక్తంగా డ్రోన్ పైలెట్ ట్రైనింగ్, భూసార పరీక్ష పై శిక్షణా”* కార్యక్రమం శుక్రవారంతో ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం తెలియజేశారు. ప్రిన్సిపల్ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ భూసార పరీక్ష రైతులందరికీ అత్యంత అవసరమని, భూమి సారవంతంగా ఉన్నప్పుడే పంటల దిగుబడి అధికంగా ఉంటుందని, డ్రోన్ వినియోగం వల్ల రైతులు కూలీల కొరతను అధికమించవచ్చునన్నారు. పి. యం.ఉషా కోఆర్డినేటర్ జి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వారి గ్రామంలో రైతులకు భూసార పరీక్షలు,డ్రోన్ సాంకేతికతను వివరించాలని కోరారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎమ్.శేఖర్ మాట్లాడుతూ డ్రోన్ సాంకేతికతపై అవగాహన ఉంటే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ నుండి విచ్చేసిన జోనల్ మేనేజర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు భూసార పరీక్ష, డ్రోన్ శిక్షణను విజయవంతంగా నేర్చుకున్నారని,ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా డ్రోన్లను పొంది ఉపాధి పొందవచ్చునన్నారు. అనంతరం ఐదు రోజులు శిక్షణ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎస్. అన్వేష్ మరియు ట్రైనర్స్ ఎస్.వినీల,కె. దుర్గాప్రసాద్, అధ్యాపకులు జి. హారతి,డా. వై. పద్మ, డా. కె. శకుంతల, ఎమ్. నాగమోహన్ రావు, జి. సాయికుమార్, ఆర్. మౌనిక, బి. శ్రీనివాసరావు,ఎన్. ఆనంద్, కిరణ్మయి, కీర్తి, లక్ష్మీ ప్రసన్న, తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ ల వినియోగం, భూసార పరీక్షలపై ముగిసిన శిక్షణ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version