ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
న్యూస్ తెలుగు/పెబ్బేరు : ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని గురువారం పెబ్బేరు ఏఐటియుసి ఆధ్వర్యంలో మహా జన హమాలీ సంఘం భవనం లో హమాలి సంఘం అధ్యక్షులు గాంధి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఫిభ్రవరి 12 న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్లును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు బి. శ్రీనివాసులు, సిద్ది శాంతమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అయినా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేటు శక్తుల లాభాలు చేకూర్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది కార్మిక వర్గంపై రైతాంగంపై గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తున్నది పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకోవచ్చింది దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్న చట్టాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నది చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్ కోడ్ లు తీసుకువచ్చింది 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చాలని చూస్తుంది అని తెలిపారు. పిఎఫ్ ఈఎస్ఐ చట్టాల్లో అనేక మార్పులు చేసి యజమానుల దయ దక్షిణాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తుంది మహిళలను ప్రమాదకరమైన పనులలో రాత్రి వేళల్లో పని మరి చేయించవద్దని గత చట్టాల్లో ఉన్నప్పటికీ నేడు వాటిని రద్దుచేసి రద్దుచేసి పులుసులతో సమానంగా రాత్రింబవలు పనిచేయాలని పద్ధతిని తీసుకువచ్చింది అని పేర్కొన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు. అధ్యక్షుడు గాంధి రాముడు, మన్యం, పెద్దమొగులున్న చంద్రయ్య శివ, వెంకటయ్య, కురుమున్న, తదితరులు పాల్గొన్నారు.(Story
: ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి )

