Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో వంద పడకల ప్రభుత్వ వైద్యశాలను వెంటనే నిర్మించాలి....

వినుకొండలో వంద పడకల ప్రభుత్వ వైద్యశాలను వెంటనే నిర్మించాలి….

వినుకొండలో వంద పడకల ప్రభుత్వ వైద్యశాలను వెంటనే నిర్మించాలి….

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్…

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద వినుకొండలో 100 పడకల వైద్యశాలను అన్ని వసతులతో కూటమి ప్రభుత్వం వెంటనే నిర్మించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కొండ్రముట్ల సుభాని అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. 30 సంవత్సరాల పై నుండి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను 100 పడకలుగా నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ పోరాటం చేస్తుంది. రోగులకు వినుకొండలో కనీసం వైద్యం అందుతుందని అంటే అది కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాట ఫలితమేనని అన్నారు. నాటికి, నేటికీ ఎంతో జనాభా పెరిగిందని, వాహనాలు పెరిగాయి. ప్రైవేటు వైద్యం పేదలకు అందని పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల ప్రజలు 50 కిలోమీటర్లు నుండి వైద్యం కోసం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు సుమారు రోజుకి 300 మంది పేషెంట్లు వచ్చి వైద్యం చేయించుకుంటారని, ఇది 30 పడకల వైద్యశాల కావడంతో చిన్న చిన్న వైద్యం కోసం వచ్చిన వైద్యం చేయడానికి వైద్యులు లేక నరసరావుపేట, గుంటూరుకి వైద్యులు రిఫర్ చేస్తున్నారని, దూరం పోలేక పేద ప్రజలు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని, దాంతోపాటు వినుకొండలో డాక్టర్ల కొరత ఉండటంతో ఉన్న నాణ్యమైన వైద్యం రోగులకు అందించలేకపోతున్నారని అన్నారు. దీనికి తోడు వినుకొండలో రోజు యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరిగి రక్తం మడుగులో ఉన్న బాధితులను వినుకొండ వైద్యశాలకు తీసుకుని వస్తే ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టరు, ఆర్థోడ్రామ్ కేర్ లేకపోవడంతో మన జిల్లా కేంద్రం అయిన నరసరావుపేటకు రిఫర్ చేస్తే అక్కడ సరైన వైద్యులు లేక వారు కూడా గుంటూరుకు రిఫర్ చేస్తున్నారని, పేద ప్రజలు వైద్యం అందక ప్రైవేటు వైద్యం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారని రాము ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. 40 సంవత్సరాలుగా మా ముందు తరాలు, మేము వినుకొండ ప్రభుత్వ వైద్యశాల 100 పడకలుగా నిర్మించాలని వినుకొండ వైద్యశాలలో శాశ్వత డాక్టర్లను వెంటనే కేటాయించాలని, వంద పడకల వైద్యశాల వినుకొండకు వచ్చేవరకు సిపిఐ పోరాటం దశలవారీగా జరుగుతుందని ఆయన అన్నారు. అఖిల భారత యువజన సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ. వినుకొండలో వంద పడకల వైద్యశాల ఏర్పాటు చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించి వైద్యశాలలో వైద్యుల కొరత లేకుండా శాశ్వత వైద్యులను కేటాయించి, సిటీ స్కాన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సుబ్బారావు పాలకులను, ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో వినుకొండ మండల కార్యదర్శి కొప్పరపు మల్లికార్జునరావు, సిపిఐ వినుకొండ పట్టణ కమిటీ సభ్యులు షేక్ మస్తాన్, షేక్ కిషోర్, చీరాల అంజయ్య, తోట నరసింహారావు, నర్రా వెంకటరత్నం, బొట్టు శీను, సిపిఐ పట్టణ నాయకులు చెన్నకేశవులు, షేక్ ఇబ్రహీం, దుర్గారెడ్డి, గుంజి వెంకటేశ్వర్లు, మహిళా నాయకులు కేసరి రమణ, కాశమ్మ, ఈశ్వరమ్మ, బర్మా లక్ష్మి, బాజీ, నన్ని, జ్యోతి, మల్లేశ్వరి, మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : వినుకొండలో వంద పడకల ప్రభుత్వ వైద్యశాలను వెంటనే నిర్మించాలి….  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!