అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్రంగా విమర్శించారు.
న్యూస్ తెలుగు/వినుకొండ : తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో జగన్ పాత్ర బయటపడకుండా ఉండేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బట్టలు విప్పిస్థానాని మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని, ప్రజలు ఎప్పుడో ఆయనకు బట్టలు విప్పిచ్చి నిలబెట్టారని చీఫ్ విప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యాక్ట్–30ను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమిస్తే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై దోపిడీలు, అరాచకాలు, దుర్మార్గాలు పెరిగాయని విమర్శించారు. విధ్వంస పాలన చేసిన వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని, ఐదేళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది జగన్‌నే అని జీవి స్పష్టం చేశారు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి మాత్రమేనని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదని జగన్‌కు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. రెచ్చగొట్టి అల్లర్లు చేయడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వస్తే చర్చించుకుందామని జగన్‌కు చీఫ్ విప్ జీవి సవాల్ విసిరారు.(Story : అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్రంగా విమర్శించారు. )

