Homeవార్తలుతెలంగాణఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఫిబ్రవరి 4న బుధవారం కార్మిక సంఘాలు (CITU -TUCI-AITUC) ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా సదస్సును యాదవ భవనంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ టి యు సి ఐ జిల్లా కార్యదర్శి గణేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ TUCI రాష్ట్ర సహాయ కార్యదర్శి పి అరుణ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అయినా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేటు శక్తుల లాభాలు చేకూర్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది కార్మిక వర్గంపై రైతాంగంపై గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తున్నది పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకోవచ్చింది దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్న చట్టాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నది చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్ కోడ్ లు తీసుకువచ్చింది 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చాలని చూస్తుంది వేతనాలు నిర్ణయించే పద్ధతిని చర్చల ద్వారా కాకుండా ఏకపక్షంగా నిర్ణయించే పద్ధతిని తీసుకువచ్చింది యూనియన్లలో గుర్తించే విషయంలో అనేక మార్పులు తెచ్చింది ఆయా పరిశ్రమల్లో అడ్వైజరీ బోర్డు తెస్తామని కోడ్ లో పొందుపరిచింది సామాజిక భద్రతపై దాడి చేస్తుంది పిఎఫ్ ఈఎస్ఐ చట్టాల్లో అనేక మార్పులు చేసి యజమానుల దయ దక్షిణాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తుంది మహిళలను ప్రమాదకరమైన పనులలో రాత్రి వేళల్లో పని మరి చేయించవద్దని గత చట్టాల్లో ఉన్నప్పటికీ నేడు వాటిని రద్దుచేసి రద్దుచేసి పులుసులతో సమానంగా రాత్రింబవలు పనిచేయాలని పద్ధతిని తీసుకువచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది కోసం భూములలో లాక్కోవడానికి తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతులు పోరాటం వల్ల ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చినప్పటికీ ఇతర రూపాలలో రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుంది విత్తన చట్టం 2025 ముసాయిదా విద్యుత్తు సవరణ బిల్లు విబిజి రాంజీ చట్టం ఇతర చట్టాలలో ముందుకు తెచ్చింది ఇప్పటికి వ్యవసాయరంగం సంక్షోభంలోనే ఉంది దీని ఫలితంగా జీవనోపాధి కోసం నగరాలకు వలసలు పెరుగుతున్నాయి నేడు జాతీయ వ్యవసాయం మార్కెట్ ముసాయిదా పత్రం ద్వారా రద్దయిన చట్టాలలోని అంశాలను ముందుకు తెస్తూ రైతాంగం పై దాడి చేస్తున్నది స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది ఈ విధానాల ఫలితంగా ఏటా పదివేల మంది రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి వాటి సవరణకు కనీసం మద్దతు ధర చట్టం తేవాలని అనే రసాలు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పెరచెను పెడుతున్నది కార్పొరేటర్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు వివిధ ట్యాక్సీ ల పేరుతో రద్దు చేస్తున్నది ప్రభుత్వం రైతాంగానికి మాత్రం రుణమాఫీ చేయడానికి చేతులు రావడం లేదు అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిఐటియు నాయకులు హనీఫ్ పుష్ప శ్రీను మధు గోవిందమ్మ భాస్కర్ టి యు సి ఐ జిల్లా కోశాధికారి ఏదుట్ల కురుమయ్య రాజు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story : ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!