క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం..
న్యూస్ తెలుగు/వినుకొండ : వినకొండ పట్టణంలో నూతనంగా క్యాటరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాటరింగ్ భవన్ నందు బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్యాటరింగ్ నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాన్ని 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు స్థానిక నరసరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా నూతన కమిటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ సైదా, ప్రెసిడెంట్ అచ్యుత సుబ్బారావు, సెక్రటరీ మాడిశెట్టి అంకారావు, ట్రెజరర్ మాగులూరి సుబ్బారావు ప్రమాణ స్వీకారం మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ అసోసియేషన్ కమిటీ పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. నియోజవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 5 మండలాల నుండి వంట మాస్టర్స్, క్యాటరింగ్ ఓనర్స్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సభ్యత్వాలను నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వారందరూ గోడ ప్రతులను అయ్యప్ప క్యాటరింగ్ హాలులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ. క్యాటరింగ్ చేసే వారందరూ రెండు ఫోటోలు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చే వారందరూ తీసుకుని రావాలని తెలిపారు. స్థానికంగా ఎదుర్కొన్న సమస్యలు కలిసికట్టుగా వ్యాపారాన్ని అద్భుతంగా మంచి వాతావరణం లో చేయడానికి మనలో ఉండే సమస్యలు మాట్లాడడానికి ఇటువంటి కమిటీ ఉంటే అందరికి బాగుంటుందని వారు తెలిపారు.(Story : క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం.. )
