Homeవార్తలుతెలంగాణప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకులు తిరుమలయ్య

ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకులు తిరుమలయ్య

ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకులు తిరుమలయ్య

న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి నందిమల్ల.తిరుమలయ్య(మాజీ సింగిల్ విండో అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్) గారి ఏకా దశదిన ఖర్మ సందర్భంగా ఆయన కుమారుడు నందిమల్ల.అశోక్ స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. తిరుమలయ్య ఆదర్శ రాజకీయ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారని నేటి నాయకులకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ప్రజా జీవితములో తిరుమలయ్య లేని లోటు తీర్చలేనిది అని అన్నారు. కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ శారదా అశోక్ ప్రజాసేవలో తిరుమలయ్య ఆశయాలను కొనసాగించాలని కోరారు. బిలక్ష్మయ్య,ఉంగ్లం.తిరుమల్,వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి,బొబ్బిలి.ప్రేమ్ కుమార్,స్టార్.రహీమ్,నందిమల్ల.రాములు,రామకృష్ణ వెంకటేష్ తదితరులు ఉన్నారు.(Story : ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకులు తిరుమలయ్య)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!