కల్లేరు జంక్షన్ లో దొరికిన శిశువు తల్లి కి కౌన్సిలింగ్ చేసిన చింతూరు ఎస్సై రమేష్
న్యూస్ తెలుగు /చింతూరు :
ఇటీవల చింతూరు మండలంలోని కల్లేరు జంక్షన్ వద్ద డాబా వెనుక పొదల్లో దొరికిన నవజాత శిశువు (మగ బిడ్డ) తల్లి ఆచూకీ తెలుసుకున్న చింతూరు ఎస్సై రమేష్ తమ సిబ్బందితో వ్యయ ప్రయాసలు చేసి ఎట్టకేలకు ఒరిస్సా రాష్ట్రము మల్కానగిరి జిల్లా లోని (పర్వత శ్రేణి) కొండలలో వున్న దయాల్ టంగ్ అనే గ్రామం లో గల తల్లిని,వారి బంధువులను గుర్తించారు. అనంతరం వారిని చింతూరు తీసుకువచ్చి శిశువుతోపాటు సిడిపిఓ, అంగన్వాడి వర్కర్స్,డాక్టర్స్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి,శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత సిడబ్ల్యుసి (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. (విశాఖపట్నం )ద్వారా శిశు గృహము నకు తరలించే విధంగాను నిర్ణయించారు. శిశువు మరికొంత కాలం చింతూరు ప్రభుత్వ హాస్పిటల్ లోనే చికిత్స అందించడం జరుగుతుందని చింతూరు యస్ ఐ రమేష్ తెలిపారు.(Story : కల్లేరు జంక్షన్ లో దొరికిన శిశువు తల్లి కి కౌన్సిలింగ్ చేసిన చింతూరు ఎస్సై రమేష్ )
