Home వార్తలు తెలంగాణ సాహసి సౌమ్య ఆశయాలను కొనసాగించాలి

సాహసి సౌమ్య ఆశయాలను కొనసాగించాలి

0

సాహసి సౌమ్య ఆశయాలను కొనసాగించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : డ్రగ్స్ మాఫియాను వేటాడి పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసి సౌమ్య ఆశయాలను కొనసాగించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య వనపర్తి జిల్లా గౌరవ అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం వనపర్తి అంబేద్కర్ చౌక్ లో డ్రగ్స్ మాఫియా దాడిలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మరణించిన సౌమ్య చిత్రపటానికి భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డ్రగ్స్ మాఫియా దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలిపారు. సౌమ్య అమర్ హై, సౌమ్య ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేశారు. డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టి సౌమ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాణాలను బలిగొన్న వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సాహసంలో సౌమ్యను యువతులు బాలికలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష, జ్యోతి, వెంకటమ్మ, సుప్రియ, బాలమణి ,గాయత్రి, అలివేల సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశి తదితరులు పాల్గొన్నారు.(Story : సాహసి సౌమ్య ఆశయాలను కొనసాగించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version