సి కృష్ణయ్య కు సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేర్ నందు పనిచేస్తున్న సి కృష్ణయ్య కు గణతంత్ర దినోత్సవ వేడుకలో ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు కలెక్టర్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య అభినందిస్తూ, తన ఆఫీసు సిబ్బందితో కలిసి, సి కృష్ణయ్యను శాలువా పూల బొకేతో సన్మానించడం జరిగింది.
జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈఓ మాట్లాడుతూ, మీరు పని చేస్తున్న కళాశాలలో పేద పిల్లలు చదువుతారు, మీ బాధ్యత మరింత పెరిగిందని తెలియజేస్తూ, విద్యార్థుల అభివృద్ధి కోసం, విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి ఇంకా మీ వంతు బాగా కృషి చేయాలని, కళాశాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, మంచి రిజల్ట్ తీసుకురావాలని తెలిపారు. ఇదే సందర్భంగా ఘనపూర్ ప్రిన్సిపల్ రాజశేఖర్ కు కూడా ఉత్తమ అవార్డు రావడం చేత డిఐఈఓ ఎర్ర అంజయ్య రాజశేఖర్ కూడా శాలువాతో పూల బొకేతో సన్మానించడం జరిగింది. మీ కళాశాల అభివృద్ధి కోసం పాటుపడాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ప్రిన్సిపల్ కి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య, సన్మాన గ్రహీతలు రాజశేఖర కృష్ణయ్య, ఆఫీస్ సిబ్బంది రమేష్ ,రాధిక శివ, శమి, రవి పాల్గొన్నారు. (Story:సి కృష్ణయ్య కు సన్మానం)

