చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “డిజిటల్ స్కిల్ పర్ ఉమెన్”పై సర్టిఫికెట్ కోర్స్

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష ఆర్థిక సహకారంతో బ్లాక్ బక్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా మంగళవారం డిజిటల్ స్కిల్ పర్ ఉమెన్ అనే అంశంపై సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన జె. హేమంత్ కుమార్ కంప్యూటర్ ఆధారిత సేవలు గురించి విపులంగా తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో డిజిటల్ సేవల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. పీఎం ఉష కోఆర్డినేటర్ జి.వెంకట్రావు మాట్లాడుతూ మహిళ సాధికారిత సాధించడానికి డిజిటల్ విద్య ఎంతగానో దోహదపడుతుందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎమ్. శేఖర్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) విద్యను అవలంబించుట తప్పనిసరి అన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. కె. శకుంతల మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ నైపుణ్యాల ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందవచ్చునన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “డిజిటల్ స్కిల్ పర్ ఉమెన్”పై సర్టిఫికెట్ కోర్స్)

