బొల్లా నువ్వు ఎన్ని పార్టీలు మారావో గుర్తు చేసుకో..
వ్యక్తిగత విమర్శలు మానుకో. నీ అహంకారమే, నిన్ను ఓడించింది….మక్కెన ఘాటు విమర్శలు
న్యూస్ తెలుగు /వినుకొండ : టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జి డి సి సి బి చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన బొల్లా, రాజ్యాంగం, స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రాధాన్యత ఇవ్వకుండా, చీప్ విప్ జీవి పై, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం బొల్లా మూర్ఖత్వానికి నిదర్శనమని మక్కెన అన్నారు. మొదటి నుంచి తమది రాజకీయ కుటుంబమని, తన తండ్రి మక్కెన చినరామయ్య గ్రామ సర్పంచ్ గా, రాజకీయంగా ఎదుగుదల ద్వారా తాను కూడా ఎంపీపీ, జడ్పిటిసి, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి వినుకొండ నియోజకవర్గాన్ని, పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ఉంచానని, అనంతరం వైసిపిలో చేరి బొల్లా ఒంటెద్దు పోకడ అహంకార ధోరణి నచ్చక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్న చంద్రబాబు పట్ల ఆసక్తి పెంచుకొని టిడిపిలో చేరానని మక్కెన అన్నారు. అయితే బొల్లా తొలి దశలో తన రక్తం కోస్తే పచ్చగా వస్తుంది అని గుండెలు బాదుకున్న బొల్లా, అనంతరం పిఆర్పి లో చేరి, అనంతరం వైసిపిలో చేరాడని మక్కెన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్రహ్మనాయుడు నాయకుల పట్ల, కార్యకర్తలు పట్ల, ప్రజల పట్ల అహంకార ధోరణితో మాట్లాడిన కారణంగానే ప్రజలు చిత్తుగా ఓడించారని మక్కెన అన్నారు. తాము గత 50 ఏళ్లుగా రాజకీయాలతో పాటు, మత్స్య వ్యాపారం చేయడం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, దీనిపై పలు మత్స్యకార కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు కూడా జీవనోపాధి కల్పిస్తున్నామని, అంతేగాని నియోజకవర్గంలో ఏ చెరువుల కింద ఒక్క సెంటు భూమి కూడా అక్రమంగా ఆక్రమించుకోలేదని మక్కెన అన్నారు. పెదకంచెర్ల గ్రామంలో పోలేరమ్మ మాన్యం తాను ఆక్రమించుకున్నానని గావు కేకలు పెడుతున్న బ్రహ్మనాయుడు, గ్రామానికి వచ్చి ఆ పోలేరమ్మ మాన్యం ఎక్కడ ఉందో చూపాలని మక్కెన కోరారు. గేద పాలల్లో ఆవు పాలు కలుస్తాయి అని తనే చెప్పు కుంటున్న బొల్లా, వల్లభ పాలల్లో కల్తీ జరగటం లేదా అని మక్కెన ప్రశ్నించారు. గతంలో బ్రహ్మనాయుడు తిరుమల డైరీ డైరెక్టర్ గా ఉన్న సమయంలో రైతులతోపాటు తమ కుటుంబం కూడా తిరుమల డైరీ కి పాలు పోసామని, అయితే శాతం తక్కువ వేసి రైతాంగాన్ని మోసం చేసిన సంగతి అందరికీ తెలుసని, బ్రహ్మనాయుడు పై, మక్కెన మరింత ఆగ్రహించారు. వినుకొండ నియోజకవర్గానికి ఇప్పటివరకు 10 మంది నేతలు ఎమ్మెల్యేలుగా ప్రజా సేవ చేశారని, బ్రహ్మనాయుడు లాగా అహంకారపూరితంగా ఎవరు మాట్లాడలేదని మక్కెన అన్నారు.
వినుకొండ లో చీప్ వి ప్ జీవి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, జి డి సి సి బ్యాంకు చైర్మన్ గా తాను నీతివంత పాలన సాగిస్తున్నామని, పాలన అలా ఉండబట్టే జీవిని ప్రజలు మూడు సార్లు గెలిపించుకున్నారని మక్కెన అన్నారు. అలాగే తాను బ్యాంకు చైర్మన్ అయిన నాటినుండి తాను రైతాంగానికి విరివిగా, సొసైటీ, సి సి రుణాలు, ఎల్టి రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వటంతో పాటు, ఎటువంటి ఎరువుల కొరత లేకుండా రైతులను ఆదుకున్నామన్నారు. అలాగే బ్రహ్మనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా విమర్శలు చేయడం ఆయన అవివేకమని, పోలవరం, అమరావతి అభివృద్ధి, లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు రావడం బొల్లా కంటికి కనపడలేదా అని మక్కెన ప్రశ్నించారు. ఇకనైనా ఆయన ఆరోగ్యరీత్యా ఆవేశ ప్రేలాపనలు మానుకొని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని మక్కెన సూచించారు. ఈ సమావేశంలో నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, పెసల వెంకటనారాయణ, షమిమ్ ఖాన్, గుడివాడ వెంకట గురునాథం, తదితరులు పాల్గొన్నారు. (Story:బొల్లా నువ్వు ఎన్ని పార్టీలు మారావో గుర్తు చేసుకో. .)

