జిల్లాలో 18 వార్డుల్లో సిపిఐ పోటీ
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా నాలుగు మున్సిపాలిటీల 18 వార్డుల్లో పోటీ చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు. సోమవారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో పృథ్వినాదం అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం సిపిఐ పోరాడుతోందని అదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి-5 అమరచింత-7 ఆత్మకూర్-4 పెబ్బేర్-2 మున్సిపాలిటీలో పోటీ చేస్తుందన్నారు. అమరచింత మూడో వార్డును గత ఎన్నికల్లో సిపిఐ గెలిచిందన్నారు. ఇప్పటికే అమరచింత ఆత్మకూర్ పెబ్బేర్ పట్టణ కమిటీల సమావేశాలు నిర్వహించామని, ఈరోజు వనపర్తి పట్టణ కమిటీ సమావేశం కూడా జరిగిందన్నారు. పట్టణ కమిటీల సమావేశాల్లో సిపిఐ ఓట్లు ఉన్న వార్డులన్నింటిలో పోటీచేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు 18 వార్డుల్లో సిపిఐ కి గణనీయ ఓట్లు ఉన్నాయని స్పష్టమైందన్నారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోను రాష్ట్రంలో కాంగ్రెస్తో ఎన్నికల పొత్తు ఉందన్నారు. రాష్ట్ర పార్టీ కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై చర్చించాలని స్పష్టం చేసిందన్నారు. దీని ఆధారంగా అమరచింత మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో సిపిఐ ఒక వార్డును గెలిచిందని ఇప్పుడు మూడు వార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను కోరామన్నారు. చర్చలు కొనసాగుతున్న అన్నారు. కాంగ్రెస్ పొత్తులో భాగంగా వనపర్తి-2, పెబ్బేర్ -1, ఆత్మకూర్-2 వార్డులను కాంగ్రెస్ పార్టీ కోరనుందన్నారు. పొత్తు కుదిరితే ఈ సీట్లకు పరిమితమై పోటీ చేస్తామని, లేదంటే తమకు ఓట్లున్న 18 వార్డుల్లో పోటీ చేసి పోరాడుతామన్నారు. పార్టీ విధానాలు జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, మహిళా నేతలు జయమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.(Story : జిల్లాలో 18 వార్డుల్లో సిపిఐ పోటీ )

