Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర’

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర’

0

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర’

న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ – జిల్లా మెజిస్ట్రేట్ డా.కృతిక శుక్ల ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా.షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్రప్రదేశ్” జనవరి 2026 థీమ్ గురించిన అవగాహన కార్యక్రమం పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లోని రాధా డిగ్రీ కళాశాల నందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షకీలా దస్తగిరి మాట్లాడుతూ. జీరో గ్యాప్ శానిటేషన్ పరిశుభ్రతలో ఎక్కడా లోపాలు ఉండకూడదు అనే నినాదం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను పూర్తిస్థాయిలో నిర్వాహణ జరగు విధంగా మన వంతు కృషి చేయాలని తెలియచేశారు. తడిచెత్త పొడిచెత్త ను వేరు చేసి తడిచెత్తతో హోం కంపోస్ట్ తయారు చేయాలని మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటలని అన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ. జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రమైన వ్యక్తిగత టాయిలెట్ ఉపయోగించాలని, పబ్లిక్ మరియు కమ్యూనిటీ టాయిలెట్స్ వినియోగం, బహిరంగ మల, మూత్ర విసర్జన నివారణ గురించి అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణలో భాగంగా సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శుభ్రం చేయించుకోవాలని, ట్విన్ పిట్ టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మల బురదను తొలగించేందుకు సరైన మరియు సురక్షితమైన యాంత్రిక పద్ధతులు పాటించాలని, లెట్రిన్స్ ద్వారా డ్రైనేజ్ ల నందు బ్లాక్ వాటర్ వదలడం చాలా హానికరమని తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బదులు జూట్ మరియు క్లాత్ బ్యాగ్స్ వాడాలని కోరారు. తదుపరి షకీలా దస్తగిరి విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాధా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కె రాధాకృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ కె హరీష్ కుమార్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, శానిటరీ సెక్రటరీలు మేస్త్రిలు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర’ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version