కోనసీమలో మెరిసిన పల్నాటి వజ్రం…. వినుకొండకు చెందిన జాతీయ చిత్రకారులు డా. వజ్రగిరి జెస్టిస్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండకు చెందిన జాతీయ చిత్రకారులు డా. వజ్రగిరి జెస్టిస్ కు కోనసీమ కలగాపులగం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ లో, పోటీలలో ద్వితీయ బహుమతి లభించింది. 170 మంది చిత్రకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జెస్టిస్ చిత్రించిన గంగిరెద్దు-దుక్కిటెద్దు,” చిత్రానికి మంచి స్థానం లభించింది. ఇదే రోజున కాకినాడ రామచంద్రాపురం లో జరిగిన ఆర్ట్ క్యాంపు లో పాలు తీస్తున్న పడితి లేగదూడ చిత్రం ఉత్తమ చిత్రంగా ప్రశంసలు అందుకుంది. నగదు బహుమతి గెలుచుకుంది. ఒకేసారి రెండు బహుమతులు పొందిన డా వజ్రగిరి జెస్టిస్ ను పలువురు పురప్రముఖులు, కవులు రచయితలు కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్స్, రాజకీయ నాయకులు అభినందించారు. వినుకొండ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెడుతున్న డా.వజ్రగిరి జెస్టిస్ మరెన్నో అవార్డులు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు.(Story : కోనసీమలో మెరిసిన పల్నాటి వజ్రం…. వినుకొండకు చెందిన జాతీయ చిత్రకారులు డా. వజ్రగిరి జెస్టిస్ )

