పెబ్బేరు లో మారుమోగిన అమ్మవారి నామస్మరణ
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో కొలువైన చౌడేశ్వరిదేవి అమ్మ వారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పురాతన కాలం నుంచి గ్రామదేవత గా భక్తుల పాలిట కొంగు బంగారమైన ప్రతి ఏటా జరిగే జాతరకు వేలాది మందితో అంగరంగ వైభవంగా జరిగే జాతరగా చౌడేశ్వరిదేవి జాతర అని,చుట్టుపక్కల మండలాల వారే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల వారు భారీగా తరలి వస్తారు. మూడు రోజుల పాటు జాతర మండల కేంద్రం పండగ వాతావరణం ఏర్పడింది అని అన్నారు. కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు వనం రాములు దిలీప్ రెడ్డి నాయకులు కర్రె స్వామి పార్వతి శ్యామలమన్యంఎల్లా రెడ్డి ఎల్లయ్య వేణు శంకర్ నాయుడు రాజశేఖర్ సోషల్ మీడియ కన్వీనర్ వడ్డె రమేష్ పబ్బ శేఖర్ గౌడ్ గోనెల సహదేవుడుసాయి రెడ్డి గోవర్ధన్ రెడ్డి యాదగిరి గౌడ్ భారతి జ్యోతి సంతోష్ రాముడు పవన్ అఖిల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : పెబ్బేరు లో మారుమోగిన అమ్మవారి నామస్మరణ )

