Home వార్తలు తెలంగాణ గొప్ప చరిత్ర గల పట్టణం పెబ్బేరు

గొప్ప చరిత్ర గల పట్టణం పెబ్బేరు

0

గొప్ప చరిత్ర గల పట్టణం పెబ్బేరు

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం లోని పెబ్బేరుకు గొప్ప చరిత్ర ఉందని, 300 సంవత్సరాల క్రితమే దేశవ్యాప్త గుర్తింపు పొందిన మండలం పెబ్బేరని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. చౌడేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే పెబ్బేరు పట్టణంలోని చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే 5 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు. బండలాగుడు పోటీల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా పెబ్బేరు పట్టణం చెలిమిల్లలో నిర్వహించిన అంతర్రాష్ట్ర వృషభరాజ బండలాగుడి పోటీల కార్యక్రమానికి మంగళవారం వనపర్తి శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం మొదటి పోటీని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వృషభరాజ బండలాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతాయని ప్రత్యేక శ్రద్ధతో వృషభ రాజుల పోషణ చేస్తున్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. పోటీలలో గెలుపు ఓటములు సహజమని ఎవరు ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వెంకట్రాములు, నాయకులు రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, రాములు యాదవ్, శ్రీరంగాపురం వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి చర్ల శ్రీహరి నాగరాజు, జయపాల్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.(Story : గొప్ప చరిత్ర గల పట్టణం పెబ్బేరు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version