చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవం
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ యువజన దినోత్సవం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. కె రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతకు మార్గ నిర్దేశకుడు,భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలలో చాటిన గొప్ప మేధావి స్వామి వివేకానందుడు అన్నారు. ‘కెరటం నాకు ఆదర్శం…లేచి పడుతున్నందుకు కాదు… పడినా తిరిగి లేస్తున్నందుకు’, ‘ప్రయత్నం చేసి ఓడిపోగానీ…. ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు’, ‘లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే…నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది’ లాంటి వివేకానందుని బోధనలు నేటి యువతకు ఆచరనీయమన్నారు.కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముళ్లి శేఖర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందని, తమ విలువైన జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణ, అవగాహన, సామాజిక బాధ్యతతో కూడిన యువతే బలమైన సమాజాన్ని నిర్మిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.వెంకట్రావు,డాక్టర్.వై పద్మ,డాక్టర్. కె.శకుంతల,జి. హారతి,ఎస్.అప్పనమ్మ, కె.శైలజ,ఎం.నాగ మోహన్ రావు, జి.సాయికుమార్,ఆర్.మౌనిక,బి. శ్రీనివాసరావు, ఎన్.ఆనంద్,కె.లక్ష్మి ప్రసన్న, ఆర్. కిరణ్మయి, కె. కీర్తి,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవం )

