Home వార్తలు తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు చిహ్నం సంక్రాంతి పండుగ

సంస్కృతి,సాంప్రదాయాలకు చిహ్నం సంక్రాంతి పండుగ

0

సంస్కృతి,సాంప్రదాయాలకు చిహ్నం సంక్రాంతి పండుగ

న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ కౌన్సిలర్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి ఆధ్వర్యములో 29వార్డు అమ్మ వారి పార్క్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మాజీ ఎం.పి,బి.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందించి నిర్వాహకులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నం నిలుస్తుందని ఈరోజు పెద్దఎత్తున ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రస్తుతం సమాజములో ఆవిష్కరింపబడుతున్న అంశాలను మహిళలు చూపారని అభినందించారు. గంగిరెద్దుల విన్యాసాలను వీక్షించి బాలబాలికలకు పతంగులు అందించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు.కనుమరుగు అవుతున్న సంప్రదాయాలను వెలుగులోకి తెచ్చిన నిర్వాహకులను సన్మానించి అభినందించారు. మొదటి బహుమతి విజేత శివమ్మ,రెండవ విజేత సిరి,మూడవ విజేత సుజాతలకు నిర్వాహకులు ఇచ్చిన బహుమతులు 10వేలు,5వేలు,2500లతో పాటు రావుల ప్రత్యేకంగా కుంకుమ భరణిలు బహుకరించారు.ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,మాజీ కౌన్సిలర్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి,నిర్వాహకులు కె.రమేష్ చంద్ర,సత్యనారాయణ రెడ్డి,మారం.బాలేశ్వరయ్య,రామచంద్రారెడ్డి,పలుస.శంకర్ గౌడ్,బైరోజు.చంద్రశేఖర్, చీర్ల.రాజేందర్ నాయకులు ఎం.డి.గౌస్,నందిమల్ల.రమేష్,సయ్యద్.జమీల్,కిషోర్ కుమార్ రెడ్డి, అమరేందర్,బాలు నాయుడు,ఖాదర్,వహీద్,ముద్దుసార్, తదితరులు పాల్గొన్నారు.(Story : సంస్కృతి,సాంప్రదాయాలకు చిహ్నం సంక్రాంతి పండుగ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version