రెండేళ్లలో వనపర్తి పట్టణాభివృద్ధికి రూ. 897 కోట్ల రూపాయల మంజూరు
న్యూస్ తెలుగు/వనపర్తి : కేవలం రెండు సంవత్సరాల లోనే వనపర్తి పట్టణ అభివృద్ధికై రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ రూ. 807 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రెండు కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఇందుకు సంబంధించి పట్టణంలో అధునాతన వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి 60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం వీధిదీపాలు ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దినదిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణాన్ని రాష్ట్రంలోనే గుర్తింపు పొందేలా చేయడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీకి సైతం ఒక రూ.కోటి 23 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఇందులో 20 లక్షల రూపాయలను వీధి దీపాల ఏర్పాటుకు కేటాయించి నేడు వీధిదీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిఈ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ భాస్కర్, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : రెండేళ్లలో వనపర్తి పట్టణాభివృద్ధికి రూ. 897 కోట్ల రూపాయల మంజూరు )

