Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో సందడి చేసిన సినీనటి సంతోషి శ్రీకర్

వినుకొండలో సందడి చేసిన సినీనటి సంతోషి శ్రీకర్

వినుకొండలో సందడి చేసిన సినీనటి సంతోషి శ్రీకర్

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలో విష్ణుకుండి నగర్ కాల్వ కట్టమీద నూతనంగా ఏర్పాటు చేసిన ‘హలో గార్జియస్ బ్యూటీ పార్లర్’ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి సంతోషి శ్రీకర్ మరియు డాక్టర్ మృదుల ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి పార్లర్‌ను ప్రారంభించారు.పార్లర్ ప్రారంభించిన అనంతరం సంతోషి శ్రీకర్ మీడియాతో మాట్లాడుతూ వినుకొండ వంటి పట్టణాల్లో కూడా మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో బ్యూటీ పార్లర్ అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇలాంటి వ్యాపారాల ద్వారా స్థానిక మహిళలకు మెరుగైన సౌందర్య సేవలు అందుతాయని ఆకాంక్షించారు.పార్లర్ నిర్వాహకులు ఇన్షియా మీలాన్ నాణ్యమైన ఉత్పత్తులను, నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎంచుకోవడం అభినందనీయమని ఆమె కొనియాడారు.పార్లర్ నిర్వాహకురాలు ఇన్షియా మీలాన్ మాట్లాడుతూ.. “వినుకొండ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాజీ లేని నాణ్యతతో, సరసమైన ధరలకే మేకప్ మరియు బ్యూటీ సేవలు అందించడమే మా లక్ష్యమని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు” అని తెలిపారు.సంతోషి శ్రీకర్ రాకతో వినుకొండలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పార్లర్ నిర్వాహకులు ఇన్షియా మీలాన్, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో సందడి చేసిన సినీనటి సంతోషి శ్రీకర్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments