అందరం కలుద్దాం ఐక్యంగా పనిచేద్దాం
న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసిపోయి పార్టీ పటిష్టత కోసం ఐక్యంగ పనిచేయాలని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గార్లు పేర్కొన్నారు
శుక్రవారం వనపర్తి పట్టణంలోనే RG గార్డెన్స్ లో నిర్వహించిన వనపర్తి మున్సిపాలిటీ 33 వార్డుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు
రానున్న వనపర్తి మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎజెండాగా భావించి ప్రతి ఒక్కరు పని చేయాలని వారు సూచించారు
ఫామ్ హౌసుల పాలన దూరం చేసేందుకు వనపర్తి పట్టణంలోని ప్రతి ఒక్కరూ పనిచేశారని దాంతో బీఆర్ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకలను అందజేస్తుందని వారన్నారు
మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తులే ప్రతి చోట గెలిచారని అక్కడక్కడ కొందరు పిలిచినంత మాత్రాన మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదని వారు సూచించారు
కాంగ్రెస్ పార్టీ ప్రాణంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పాత కొత్త వేగం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతను ఇస్తుందన్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం
200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం
ఇందిరమ్మ ఇళ్లు
రేషన్ కార్డులు
సన్న బియ్యం
మహిళా సమాఖ్య మహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు
లాంటి అనేక పథకాలు చేపట్టి నిరుపేదల సంక్షేమానికి పాటు బడిందన్నారు
వనపర్తి పట్టణంలోని 33 వార్డులకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టామని వారు పేర్కొన్నారు
చేసిన పని చెప్పుకోవడంలో మనం వెనుకబడి పోతున్నామని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారన్నారు
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో ఎవ్వరి పేరును సూచించిన ప్రతి ఒక్కరు వారి గెలుపు కోసం పనిచేయాలని వారన్నారు
రిజర్వేషన్ల ప్రకారం క్షేత్రస్థాయిలో వ్యక్తుల ప్రాధాన్యతను బట్టి సర్వేలు చేయించి గెలుపు బాటలో ఉండే ప్రతి ఒక్కరికి టికెట్లు అందుతాయని వారికి ప్రమోషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మనస్ఫూర్తిగా పనిచేయాలని వారు సూచించారు
ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు సైతం అవకాశం ఉన్నచోట వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వారన్నారు
మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి సమానులేనని వర్గపోరుతో పార్టీకి నష్టం వచ్చే పనులు చేయకూడదన్నారు
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రెండు సంవత్సరాల కాలంలో వనపర్తి నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండువేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వారు తెలిపారు
అందులో వనపర్తి పట్టణానికి 807 కోట్ల రూపాయల బ్రిటి పనులు చేపట్టామని వారు పేర్కొన్నారు
రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను నిర్ణయించాల్సి వస్తోందని ఎవరు కూడా నిరాశ చెందకూడదన్నారు
ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలని వారు సూచించారు
కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, pcc సభ్యులు శంకరప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య, శ్రీలత రెడ్డి, తిరుపతయ్య గౌడ్, బి కృష్ణ, పుట్టపాకుల మహేష్, ధనలక్ష్మి, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story : అందరం కలుద్దాం ఐక్యంగా పనిచేద్దాం )

