Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గీతాంజలి విద్యాసంస్థలు నైతిక విలువలతో తీర్చిదిద్దుతున్నాయి 

గీతాంజలి విద్యాసంస్థలు నైతిక విలువలతో తీర్చిదిద్దుతున్నాయి 

0

గీతాంజలి విద్యాసంస్థలు నైతిక విలువలతో తీర్చిదిద్దుతున్నాయి 

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ

న్యూస్ తెలుగు/వినుకొండ: గీతాంజలి 25 వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకలు స్థానిక కారం పూడి రోడ్ లోని ఎండ్లూరి వెంచర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విశిష్ట అతిథిగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ యాక్టర్ హాస్యబ్రహ్మ డాక్టర్ కే బ్రహ్మానందం హాజరయ్యారు. వీరికి గీతాంజలి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఏర్పాటైన వేడుకల సభలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ. గత 25 ఏళ్లుగా గీతాంజలి విద్యాసంస్థలు ఎందరో విద్యార్థులను నైతిక విలువలతో విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నత శిఖరాలు అందుకునేలా కృషి చేస్తున్నారని విద్యాసంస్థల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా రైతు కష్టనష్టాలు నృత్య రూపంలో చిన్నారులు కనబరిచిన నృత్యం ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉందని, విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి విద్యలో ముందుకు సాగాలన్నారు. విద్య అంటే ఒక విలువ అని, కేవలం మార్కులే కాదని, నైతిక విలువలతో సమాజంలో గుర్తింపు ఉండే విధంగా ముందుకు సాగాలని శైలజ అన్నారు. గీతాంజలి స్కూల్ గత 16 ఏళ్లుగా టెన్త్ ఫలితాల్లో ముందంజలో సాగుతున్నదని అభినందించారు. అలాగే ఇప్పటి విద్యార్థులు చాలా చైతన్యంతో ఉన్నారని, వారి మనోభావాలు ఇష్ట ఇష్టాలు కనుగుణంగా తల్లిదండ్రులు గుర్తెరిగి వ్యవహరిస్తూ ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా సహకరించాలని, వేడుకలకు విచ్చేసిన రైతు కుటుంబాలను కోరారు. హాస్య నటబ్రహ్మ కే బ్రహ్మానందం మాట్లాడుతూ. తాను ఈ పల్నాడు ప్రాంతం వాడినని, సత్తెనపల్లి ప్రాంతం ముప్పాళ్ళ గ్రామం అని, తాను సత్తెనపల్లి సర్వే స్కూల్లో చదివి తన తండ్రి కష్టపడి చదివించి డిగ్రీ ఎంఏ చదివించారని, అనంతరం అత్తిలిలో లెక్చరర్ ఉద్యోగం లో చేరానని, అనంతరం సినీ రంగంలో చేరి 1200 పైగా సినిమాలలో నటించి పద్మశ్రీ అవార్డు, గిన్నిస్ రికార్డు డాక్టరేట్ పొందానని అన్నారు. లైఫ్ ఒక ఛాలెంజ్ గా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. చదువు నేర్పిన గురువులను తమ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న తల్లిదండ్రులను గుర్తించి మంచి మేధావులుగా ఎదిగినప్పుడే భారతదేశానికి మంచి పేరు రావడంతో పాటు, ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందని అన్నారు.. గీతాంజలి వ్యవస్థాపకులు ఎండ్లూరి శేషగిరిరావు తొలుతగా స్వాగ తోపన్యాసం చేస్తూ 25 ఏళ్ల క్రితం గీతాంజలి విద్యాసంస్థల ఏర్పాటుకు అందరూ ఎంతో సహకారం అందించాలని, వారిని మరువలేనని అన్నారు. అలాగే మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ శైలజ అమరావతి రాజధాని ఏర్పాటు ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిందని కొనియాడారు. అలాగే హాస్యనటులు డాక్టర్ కే బ్రహ్మానందం ఒక అధ్యాపకులుగా ఉండి ఈ స్థాయికి ఎదగటం మన జిల్లా వారే కావటం ఎంతో అదృష్టమని అన్నారు. కాగా దేశం యా వత్తు అన్ని రంగాలలో పనిచేస్తున్న వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారని, ఒక్క రైతు మాత్రమే ఇబ్బందులు పడుతున్నాడని, ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలని కోరారు. అలాగే వ్యాఖ్యాతగా యాంకర్ స్నేహారిక వ్యవహరించగా, చిన్నారుల నృత్యాలు అందరిని ఆలరించాయి. ఈ కార్యక్రమంలో నవీన విద్యాసంస్థల డైరెక్టర్ వై చిన్నపరెడ్డి, చైతన్య విద్యాసంస్థల ఏజీఎం. దుర్గాప్రసాద్, గీతాంజలి కరస్పాండెంట్ వై కిషోర్, ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : గీతాంజలి విద్యాసంస్థలు నైతిక విలువలతో తీర్చిదిద్దుతున్నాయి  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version