సిపిఐ వందేళ్ళ పండుగ పోస్టర్ల ఆవిష్కరణ.. సభ విజయవంతానికి పిలుపు
న్యూస్ తెలుగు/వనపర్తి : ఖమ్మం జిల్లా లో ఈ నెల 18న జరిగే సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాల బహిరంగ సభ గోడపత్రికలను వనపర్తి ఆఫీసులో నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత పృథ్వినాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడారు. డిసెంబర్ 26, 1925లో ఉత్తరప్రదేశ్ కార్పూర్ సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ 26, 2025 వరకు ముందేళ్ళు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో వందేళ్ల పండుగ జరగనుంది అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి దేశ రాజకీయాల్లో సిపిఐ కీలక పాత్ర పోషిస్తూ వచ్చిందన్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి దేశానికిస్వాతంత్రం సాధించిందన్నారు. నిజాం నవాబ్ పాదాల కింద నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ద్వారా విముక్తి కల్పించిందన్నారు. 3000 గ్రామాలను విముక్తం చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర సిపిఐదు అన్నారు. దేశంలో మొట్టమొదట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని సిపిఐ జాతీయ పార్టీ తీర్మానం చేసిందని తెలంగాణ సాధించే వరకు పోరాడింది అన్నారు. కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాలకు సిపిఐ ఎండగా నిలబడి ఎన్నో చట్టాలను సాధించిందన్నారు. రుణమాఫీ పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు దున్నేవాడికి భూమి ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు సిపిఐ పోరాటం వల్లే అమలవుతున్నాయన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిపిఐ పోరాటం వల్ల వచ్చిందన్నారు. పోరాటాలు ఉద్యమాలు అనేకమంది సిపిఐ యోధులు ప్రాణాలను అర్పించారన్నారు. అలాంటి పార్టీలో ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న వందేళ్ళ పండుగకు ఐదు లక్షల మంది తరలిరారున్నారని, వనపర్తి నియోజకవర్గం నుంచి సిపిఐ కార్యకర్తలు అభిమానులు నేతలు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, పృథ్వి నాదం, జయమ్మ, లక్ష్మీనారాయణ, శిరీష, సుప్రియ, వెంకటయ్య, రాముడు తదితరులు పాల్గొన్నారు.(Story : సిపిఐ వందేళ్ళ పండుగ పోస్టర్ల ఆవిష్కరణ.. సభ విజయవంతానికి పిలుపు )

