రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ఎస్సీ రైతులకు డ్రిప్ సేద్యం పరికరాలు ఉచితం..
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని, రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఆధ్వర్యంలో గురువారం వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు నందు షెడ్యూల్ కులాలకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ రైతులకు బ్యాటరీ పవర్ స్పేర్లు, కార్ బాలిన్ పట్టలు, మట్టి పరీక్ష కిట్టులు, వరి, మొక్కజొన్న విత్తనాలను అందజేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి అధ్యక్షతన జరిగిన సదస్సులో చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గం లోని షెడ్యూల్ కులాలకు చెందిన రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేయటం సంతోష్కరమన్నారు. సూక్ష్మ సాగునీటి పథకం క్రింద బిందు, తుంపర్ల పరికరాలను ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులకు 100% కల్పించి ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఐదు ఎకరాల లోపు ఎస్సీ ఎస్టీ సన్న చిన్న కారు రైతులకు ఉచితంగా పరికరాలను సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. ఐసీఆర్ రైస్ రీసెర్చ్ సైంటిస్టులు తీసుకొచ్చిన వరి వంగడం ద్వారానే నేడు ఎకరానికి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందన్నారు. గతంలో ఎకరానికి 10 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చేదని, నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సైంటిస్టులు తీసుకొచ్చిన వరి వంగడాల ద్వారా దిగుబడి పెరిగి 40 బస్తాలు వస్తుందన్నారు. రీసెర్చ్ సమస్త వారు దేశంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ఆహార భద్రతకు రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సైంటిస్టుల సలహాలు సూచనలు రైతులు విధిగా పాటించి మంచి దిగుబడును సాధిస్తూ, ఆర్థిక ప్రగతి సాధించాలని ఆయన కోరారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు వచ్చే పంట సాగు వైపు రైతులు ముగ్గు చూపాలని సూచించారు. ఉద్యానవన పంటలు మంచి లాభాలు ఉన్నాయి సమకూరుస్తుందని, పండ్లు, కూరగాయలు తదితర హార్టికల్చర్ పంటల సాగువలన రైతు ఆర్థిక ప్రగతి సాధించవచని తెలిపారు. ఇవ్వచ్చుగా వర్గంలో ఎస్సీ, ఎస్టీ రైతులు కూటమి ప్రభుత్వం అందిస్తున్న నూరు శాతం రాయితీ బిందు సేద్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని పండ్ల తోటల సాగు చేసి అధిక దిగుబడితో మంచి లాభాలు పొంది ఆర్థిక ప్రగతి సాధించాలని కోరారు. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, వ్యవసాయ పరికరాలకు రాయితీలు పథకాలు ప్రవేశపెట్టిందని రైతులందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీఆర్ సైంటిస్టులను ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి రవికుమార్, ఐదు మండలాల ఏవోలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం)

