సంక్రాంతి నాటకోత్సవాలు జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రపంచీకరణ నేపథ్యంలో కనుమరుగై పోతున్న పల్లె తల్లి పండుగ శోభ కు తిరిగి ప్రాణం పొసే బృహత్తర కార్యక్రమానికి శ్రీ తారకరామ కళాపరిషత్ కారుమంచి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12 , 13 , 14 తేదీలలో సంక్రాంతి సంబరాలు , సంక్రాంతి నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి నడుం బిగించి అవసరమైన ఏర్పాట్లను సైతం పూర్తి చేసింది . స్థానిక దక్షిణం బజారు లోని కోదండ రామాలయం వేదికగా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు కార్యకర్తలు శ్రమిస్తున్నారు. ఈ కార్య క్రమాల ఫ్లెక్సీ ల హడావుడితో గ్రామానికి ఇప్పటికే పండుగ శోభ వచ్చింది . 12 వ తేదీ సాయంత్రం ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిధిగా హాజరై నాటకోత్సవాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లి ఖార్జునరావు , తెలుగు నాటక పరిషత్తుల సంఘం , వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు , నరకరంగా ప్రముఖులు కందిమళ్ల సాంబశివరావు , ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకమరావు , అప్పసాని రాజేష్ , కమ్మ అభివృధి కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు మరియు రాష్ట్రంలోని వివిధ కళా పరిషత్తుల ప్రతినిధులు తదితరులు అతిధులుగా పాల్గొంటారు. మొదటిరోజున ఒంగోలు వారి “సంగీత విభావరి “, వీరన్నపాలెం వారి “దీపం కింద చీకటి ‘ నాటిక మరియు గుంటూరు వారి “ఇంద్రప్రస్థం” నాటిక ప్రదర్శనలు ఉంటాయి . 2వ రోజు అనగా 13 వ తేదీన మధ్యాహ్నం నుండి మహిళలకు ముగ్గుల పోటీలు జరుగుతాయి . సాయంత్రం మాజీ డి ఎల్ డి ఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు ముఖ్య అతిధిగా హాజరై నాటకోత్సవాలలో పాల్గొంటారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ , వినుకొండ రవీంద్ర విద్యాసంస్థల అధినేత మాబు సుభాని , కళా విపంచి హైదరాబాద్ అధ్యక్షులు బొప్పన నరసింహారావు, రోటరీ ప్రతినిధులు తదితరులు అతిధులుగా పాల్గొంటారు. హైదరాబాద్ వారి “మేజిక్ షో” కాట్రపాడు వారి ” మంచి మనసులు ” నాటిక మరియు చిలకలూరిపేట వారి ” మా ఇంట్లో మహాభారతం ” నాటిక ప్రదర్శనలు ఉంటాయి . 4వ రోజు అనగా 14 వ తేదీన మధ్యాహ్నం నుండి మహిళలకు ఆటల పోటీలు , బాలలకు ఆటలు మరియు డాన్స్ పోటీలు జరుగుతాయి . సాయంత్రం నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ అధ్యక్షులు జవ్వాజి వెంకటరావు నాటకోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు.. హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త దేవబత్తిని హనుమంతరావు , ప్రఖ్యాత రంగస్థల నటులు , దర్శకులు ఎస్ ఎం బాషా , పౌరాణిక నటులు రామాపురం వెంకటేశ్వర్లు తదితరులు అతిధులుగా పాల్గొంటారు. కారుమంచికి చెందిన సుప్రసిద్ధ రంగస్థల నటులు సుబ్బిశెట్టి ఫేమ్ స్వర్గీయ అర్వపల్లి సుబ్బారావు స్మారక పురస్కారాన్ని అద్దంకి కి చెందిన ప్రఖ్యాత నటులు ఆలకుంట శ్రీనివాసరావు కు అందజేస్తారు. వినుకొండ బాలలచే ” సాంప్రదాయ నృత్యాలు ” కొలకలూరు వారి ” జనరల్ బోగీలు” నాటిక మరియు అద్దంకి వారి ” సుందరి – సుబ్బారావు ” (చింతామణి) హాస్య కదంబం ప్రదర్శనలు ఉంటాయి . మూడురోజుల పాటు జరిగే కార్యక్రమాల ప్రాంగణానికి ఇటీవలే దివంగతులైన ప్రముఖ సినీ సహాయ దర్శకులు , రంగరాస్తాల నటులు , రచయిత , దర్శకులు కూడా అయినటువంటి స్వర్గీయ కర్రీ కానక నారాయణ కళా ప్రాంగణం గా నామ కారణం చేశారు . ఈ ప్రాంతంలో మొదటి సారిగా అత్యంత భారీగా జరుగుతున్న కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పరిషత్తు అధ్యక్షులు ముప్పా శ్రీనివాసరావు , పరిషత్తు కార్యవర్గం వారు మరియు కారుమంచి గ్రామ పెద్దలు కోరుతున్నారు.(Story:సంక్రాంతి నాటకోత్సవాలు జయప్రదం చేయండి)

