స్వచ్ఛత , పరిశుభ్రతపై అవగాహన
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ – జిల్లా మెజిస్ట్రేట్ డా. కృతిక శుక్ల ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా. షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్చ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా గా పురపాలక సంఘం మరియు ఆల్ ఇండియా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఫస్ట్ వార్డ్ గర్ల్స్ హైస్కూల్ నందు విద్యార్థుల కు స్వచ్ఛత పై తడి చెత్త, పొడి చెత్త , సింగెల్ యూస్ ప్లాస్టిక్ ,హ్యాండ్ వాష్, జంక్ ఫుడ్ పలు అంశాలపై విద్యార్థులు అవగాహనా కల్పించారు. అంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, చిత్ర లెకణం పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికీ ప్రశంస పత్రాలు, మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమం లో ఫాస్ట్ వార్డ్ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్. బి. శైలజ కుమారి, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.కె. ఇస్మాయిల్, డిస్టిక్ కో ఆర్డీనేటర్ ఎం. శివ పార్వతి, స్కూల్ సిబ్బంది, మున్సిపల్ మేస్త్రీలు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story:స్వచ్ఛత , పరిశుభ్రతపై అవగాహన)
