Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యటన

వినుకొండలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యటన

0

వినుకొండలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యటన

న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజె రామారావు వినుకొండ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల, కేజీబీవీ, టి డబ్ల్యూ ఆర్ ఎస్ , ఏ పీ ఎం ఎస్ తదితర ప్రభుత్వయాజమాన్యాల ప్రిన్సిపల్స్ మరియు ప్రధానోపాధ్యాయుల, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు 1,2 లతో, సీఆర్పీలు మరియు ఏఈ ల తో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, వినుకొండ నందు సమావేశంను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పల్నాడు జిల్లా గత సంవత్సరం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో 598, 596 మార్కులతో పల్నాడు ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉన్నాయని ఈ సంవత్సరం కూడా దానికి తగ్గకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా కలిసి కష్టపడి పనిచేసి 10వ తరగతి ఫలితాల్లో పల్నాడు ప్రాంతం గర్వపడే విధంగా కృషి చేయాలని, అంతేకాకుండా పల్నాడు జిల్లా విద్యాశాఖకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా రాష్ట్రంలో ముందు ఉండే విధంగా అందరూ కలిసి సమైక్యంగా కృషి చేయాలని, పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు పరచాలని, ప్రాథమిక స్థాయి విద్యార్థులు జరుగుతున్న 75 రోజుల జీఎఫ్ఎల్ఎన్ ను పకడ్బందీగా అమలు పరచాలని, ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనాన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరూ భుజించే విధంగా కృషి చేయాలనిఅన్నారు..కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హాస్టల్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారికి వడ్డించే భోజన విషయంలో, రోజువారి అమలవుతున్న మెనూ విషయంలో నాణ్యత లో రాజీ పడవద్దని,ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన నిధులకు సరిపడా బిల్లులు అప్లోడ్ చేయాలని, ఉపాధ్యాయుల మరియు విద్యార్థులు హాజర విషయంలో రాజీ పడవద్దని, ప్రభుత్వ ఉపాధ్యాయులుతమ వివరాలు అన్నీ టిఐఎస్ లో పక్కాగా నమోదు చేసుకోవాలని, దాని ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు బదిలీలు పారదర్శకంగా జరిగేందుకు దోహదపడుతుందని అన్నారు. పరీక్షాపే చర్చ నమోదులో పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే ముందుండే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరిని శ్రీ రామారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఉప విద్యాశాఖ అధికారి ఎస్ ఎం సుభాని, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష సిబ్బంది పూర్ణచంద్రరావు, పద్మారావు, నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు 1,2 లు, వివిధ రెసిడెన్సి పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యటన )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version