Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ

శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ

శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ

మరో 5 వేల మంది డ్రైవర్లకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వెల్లడి..

న్యూస్ తెలుగు/వినుకొండ : ఏపీలో రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గించేందుకే నాణ్యత ప్రమాణాలతో రోడ్లు వేస్తూ, డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం చీఫ్ విప్ కార్యాలయంలో శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 65 మంది వివిధ వాహన డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, చీప్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా డ్రైవర్లకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కేవలం ఎల్ ఎల్ ఆర్ కు 410 రూపాయలు చెల్లిస్తే, మిగతా సొమ్ము శివశక్తి ఫౌండేషన్ చెల్లించి డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేని వారంతా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించి, ఫోర్ వీలర్ డ్రైవర్లు బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాయితీపై హెల్మెట్ల కూడా ఇవ్వనున్నట్లు జీవి తెలిపారు. నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి భవిష్యత్తులో 5000 మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా జీవి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎం వి ఐ. శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ. ఇరువైపులా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది లక్ష డెబ్బై వేల మంది రోడ్డు ప్రమాదం లో మరణించగా, ఒక్క పల్నాడు జిల్లాలోనే ఆరు వేల రెండు వందల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. కాగా నేడు అన్ని జాతీయ రహదారులు నాణ్యత ప్రమాణాలతో ఉన్నాయని, డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తూ ప్రయాణం చేయాలన్నారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. పూర్తిగా సెల్ ఫోన్ లో మాట్లాడటం నిలిపివేసి డ్రైవింగ్ చేయాలన్నారు. 60 కిలోమీటర్ల స్పీడ్ కన్నా అతివేగం పనికిరాదన్నారు. రోడ్లపై ఉన్న మార్కులు గమనిస్తూ వాహనాలు తిప్పటం, ఆపటం వంటి రూల్స్ విధిగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా చేతుల మీదుగా 65 మంది అర్హులైన డ్రైవర్లకు ఉచితంగా లైసెన్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి డి సి సి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, కూటమి నేతలు బొంకూరి రోశయ్య, పి నాగేశ్వరరావు, నిశ్శంకర శ్రీనివాసరావు, కే నాగ శ్రీను, పివి సురేష్ బాబు, జి కాళింగ రాజు, ఏ వాసుదేవరెడ్డి, మక్కెన కొండలు, గోవిందరాజులు, నాయక్, వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, పట్టణ సీఐ ప్రభాకర్ పాల్గొన్నారు.(Story : శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!