Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గంజాయి జోలికి వెళ్ళకండి జీవితాలను పాడు చేసుకోకండి. ఏ ఎస్ పి.బొడ్డు హేమంత్

గంజాయి జోలికి వెళ్ళకండి జీవితాలను పాడు చేసుకోకండి. ఏ ఎస్ పి.బొడ్డు హేమంత్

గంజాయి జోలికి వెళ్ళకండి జీవితాలను పాడు చేసుకోకండి. ఏ ఎస్ పి.బొడ్డు హేమంత్

న్యూస్ తెలుగు /చింతూరు : గంజాయి జోలికి వెళ్ళవద్దని, వెళ్లి జీవితాలను పాడు చేసుకోవద్దని, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి కి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో భాగంగా చింతూరు ఏ ఎస్ పి బొడ్డు హేమంత్, సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో అభ్యుదయ సైకిల్ ర్యాలీ, వేగంగా నడక చింతూరులో శనివారం కల్లేరు అడ్డరోడ్డు నుండి ఎర్రంపేట, చింతూరు పోలీస్ స్టేషన్ మీదుగా రాజీవ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో గంజాయి వద్దు, దాని వెళ్లొద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు అనే నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎ.ఎస్.పి హేమంత్ మాట్లాడుతూ ఈ ర్యాలీ కార్యక్రమాలు 2025 నవంబర్ 11వ తేదీ నుంచి ఉన్నతాధికారులైన ఆంధ్రప్రదేశ్ డిఐజి, ఐజి, ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం వరకు నిర్వహిస్తున్నామని, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగే కార్యక్రమం తో ముగుస్తుందని తెలిపారు. గంజాయి సేవించడం, సాగు చేయటం, రవాణా చేయడం, రవాణా చేసే వారికి సహకరించటం నేరమని పేర్కొన్నారు. గత రెండేళ్లగా అల్లూరు జిల్లాలో 40 వేల కేజీల గంజాయి పట్టుబడిందని తెలిపారు.చట్ట ప్రకారం గంజాయి రవాణా అరికట్టడానికి ప్రజల, పౌరుల, రాజకీయ నాయకుల, మీడియా మిత్రుల సహకారం ఎంతో కావాలని కోరారు. గంజాయి నిర్మూలనపై వ్యాసరచన స్థానిక ఏపీ ఆర్, డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ హై స్కూల్, భాస్కర విద్యానికేతన్ హై స్కూల్ తదితర పాఠశాలలో పోటీలో నిర్వహించామని పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రత్నమాణిక్యం, భాస్కర విద్యానికేతన్ ప్రిన్సిపాల్, వేణుగోపాల్ పాఠశాలల కళాశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story  : గంజాయి జోలికి వెళ్ళకండి జీవితాలను పాడు చేసుకోకండి. ఏ ఎస్ పి.బొడ్డు హేమంత్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!