ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ , నిశ్శంకర శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి యాదవ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ )

