మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. గజమాలలు, శాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. కార్యాలయం అంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ సందడి నెలకొంది.(Story : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు )
