ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
జీవి ఆంజనేయులు కి శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు…
న్యూస్ తెలుగు/వినుకొండ : నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గురువారం ఉదయం నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు . ఈ సంద్భంగా ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు,కార్యకర్తలు జీవి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. గజమాలలతో, శాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. జీవి మాట్లాడుతూ.. తనపై చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.(Story : ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు )
