ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణం లోని ఎస్టి కులం కు చెందిన పేదలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు శుక్రవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ను బిజెపి కార్యకర్తలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కట్టెల పొయ్యి పై వంట చేసుకున్న మహిళలను గుర్తించి అర్జీలు పెట్టించి దానిలో భాగంగానే అంబేద్కర్ కాలనీలో 12 మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తో పాటు అంబేద్కర్ కాలనీ బిజెపి నాయకురాలు పోల మరియమ్మ, శావల్యాపురం మండలం బిజెపి నాయకులు శివాజీ , వెంకయ్య, బిజెపి నాయకులు గర్రె అనిల్ , కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు )

