అంతర్ జిల్లా మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
16 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి హనుమంతరావు..
పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులు…
న్యూస్ తెలుగు/వినుకొండ :అంతర్ జిల్లా మోటార్ సైకిల్ దొంగను వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు శుక్రవారం వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట డిఎస్పి ఎం.హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామానికి చెందిన వడితే సత్తార్ నాయక్ మోటార్ సైకిళ్ల దొంగను స్థానిక వెల్లటూరు రోడ్ లోని మిద్దె భాయ్ వద్ద వినుకొండ పట్టణ సిఐ బి.ప్రభాకర్, ఏ.బాలకృష్ణ వాహనాల తనిఖీలు చేస్తుండగా దొంగని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు. వెల్లటూరు నుండి వినుకొండ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న సత్తార్ నాయక్ ను బండి ఆపి తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ వివరాలు లేకపోవడంతో దింగిలించిన మోటార్ సైకిల్ గా గుర్తించడం జరిగింది. దీనిపై సత్తార్ నాయక్ ను పోలీసులు విచారించగా తాను 9వ తరగతి చదువుతున్నారని, చదువు మానివేసి పరదాలు కొట్టుకునే పనికి వెళ్లేవాడినని, 10 ఏళ్ల తర్వాత శాంతి బాయ్ అనే ఆమెతో ప్రేమ వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం కలరని, గత 5 ఏళ్లుగా పరదాల వ్యాపారం మానేసి ఆటో నడుపుతూ జీవించేవాడని వివరించారు. దుర్వ్యసనాలకు బానిసైన సత్తార్ నాయక్ విలాసాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించేందుకు మోటార్ సైకిళ్లు దొంగతనం చేసేవాడని తెలిపారు. ఇలా వినుకొండ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నాగార్జునసాగర్, మార్కాపురం, మంగళగిరి, ప్రాంతాల్లో దొంగతనం చేసిన బైకులను తర్వాత అమ్ముకునేందుకు వెల్లటూరు గ్రామ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద దాచినట్లు, తాను వేసుకు వచ్చిన బైక్ కూడా అలా దొంగతనం చేసినదేనని చెప్పడంతో అరెస్టు చేసి, 8 లక్షలు విలువ గల 16 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ హనుమంతరావు తెలిపారు. వీటిలో 6 బైకులకు వివరాలు లేవని, 10 బైకులకు సంబంధించిన పూర్తి వివరాలను వారు వెల్లడించారు. అలాగే పైన తెలిపిన వివిధ ప్రాంతాలలో యజమానులు వినుకొండ పోలీస్ స్టేషన్ లో సమాచారం సేకరించవచ్చన్నారు. అలాగే ఈ సందర్భంగా విధుల నిర్వహణలో నేరస్తుల ఆచూకీ కనుగొనడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్ సిబ్బంది. షేక్ చాస్ భాష, కె. బి. వెంకటేశ్వర్లు, కె. శ్రీనివాస రావు లను డి.ఎస్.పి. ఎం హనుమంతరావు అభినందించి, నగదు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ బి. ప్రభాకర్, ఎస్సైలు, ఏ బాలకృష్ణ, ఉదయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.(Story : అంతర్ జిల్లా మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
)
