Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు నూతన సం సంబరాలు

విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు నూతన సం సంబరాలు

విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు నూతన సం సంబరాలు

న్యూస్ తెలుగు/అనంతపురం టౌన్ వ్యవసాయ శాఖలో పని చేస్తూ పదవి విరమణ అయ్యి 10సం పైబడిన కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగులు గత ఐదు సంవత్సరాలుగా నూతన సంవత్సర ముందస్తుగా వేడుకలను జరుపుకోవడానికి కర్నూల్ నగరంలో ఉన్న ఉద్యోగ కాలనీలో వ్యవసాయ శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ ఎల్. సి. రామారావు గృహం వేదికగా మారింది. అందులో భాగంగా మంగళవారం అనంత, కడప జిల్లా వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగులు వెంకటేశ్వర్లు,
పి. సుబ్బారెడ్డి, కృష్ణ స్వామి, వరదరాజులు, నాగరాజు,నారాయణ తెచ్చిన కేకును ఎల్ సి రామారావు దంపతులు కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ముందస్తు వేడుకలను ఆనవాయితీగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎక్కడో ఒకచోట ఒకరిద్దరితో కలవడం జరుగుతుంది కానీ ఇటువంటి సమయంలో దాదాపు పది మంది పైగా ఉద్యోగులు రావడం విశేషం అన్నారు. 30 ఏళ్లు పై గా శాఖలో పనిచేసి విశ్రాంతి ఉద్యోగులుగా కలవడం చూస్తుంటే ఇప్పటికీ మా కాలేజీ మిత్రులతో కలిసిన అనుభూతి కలుగుతుందన్నారు. ఒక్కొక్కరి ఆరోగ్య విషయాలు ఇతర విషయాలపై సూచనలు సలహాలు తీసుకోవడానికి మాకు ఇదొక వేదికగా మారినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.(Story : విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు నూతన సం సంబరాలు  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!