ఆర్టీసీలో మెడికల్ క్యాంపు, ఆరోగ్యంపై డ్రైవర్లకు అవగాహన
న్యూస్ తెలుగు/వినుకొండ : వివేకానంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావుపేట డాక్టర్స్ అందించే వైద్య సేవలను ఆర్టీసీ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ డిఎం. జె నాగేశ్వరరావు, సీనియర్ డ్రైవర్స్ ఇన్స్పెక్టర్ ( ఎస్. డి. ఐ.), కార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షులు కే.రమేష్ కోరారు. బుధవారం ఆర్టిసి బస్టాండ్ కంట్రోల్ పాయింట్ వద్ద డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ కే రమేష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టిసి ఉద్యోగులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ శాఖమూరి బాజీ బాబు, ఎండి. ( డి ఎన్ బి ) మాట్లాడుతూ. ప్రధానంగా డ్రైవర్లు తమ శరీరాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రయాణం చేసే బస్సులో ఆ కుటుంబాలతో డ్రైవర్ కుటుంబాలు కూడా ఉంటాయని , ఎప్పటికప్పుడు మెడికల్ ఫిట్నెస్ చూయించుకుంటూ డ్యూటీ లేని సమయాలలో పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్నారు. షుగర్, ఆయాసం, గుండె, మెదడు సంబంధించి వాటిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే డాక్టర్ కన్నెగంటి విద్యాసాగర్ ఎంబిబిఎస్ న్యూరో సర్జన్ మాట్లాడుతూ. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు శరీరాన్ని పూర్తి అదుపులో ఉంచుకోవాలని, డ్రైవ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడడం తప్పిదమన్నారు. పూర్తిగా తల కిందకు వంచి సెల్ఫోన్ మాట్లాడటం వల్ల మెడ నరాలు, మెదడు భాగంలో నరాలు కు అలసట వచ్చి ఇబ్బందులు వస్తాయన్నారు. డ్రైవింగ్ సీట్లో వెన్నుపూస వద్ద సీటు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంతో విధులకు హాజరు కావాలన్నారు. కె రమేష్ మాట్లాడుతూ. డ్రైవర్స్ డ్యూటీ లేని సమయంలో పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేయాలని, కేవలం హారన్ వల్లే అడ్డంకులు తొలగవని, మెలుకువతో డ్రైవింగ్ చేయాలన్నారు. డిపో మేనేజర్ జే నాగేశ్వరరావు మాట్లాడుతూ. డాక్టర్స్ సూచనలు, సలహాలు పాటిస్తూ విధులు నిర్వహిస్తూ, వారు అందించే వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కిట్స్, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న పేరయ్య, పి రాఘవ, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఖాజా, జి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.(Story : ఆర్టీసీలో మెడికల్ క్యాంపు, ఆరోగ్యంపై డ్రైవర్లకు అవగాహన )

