గిరిజన జిల్లా పోలవరం ఏర్పాటు హర్షనీయం బిజెపి చింతూరు డివిజన్
న్యూస్ తెలుగు /చింతూరు : పోలవరం పేరుతో రంపచోడవరం కేంద్రంగా 12 మండలాలను పోలవరం జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల బిజెపి చింతూరు డివిజన్ కమిటీ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఈ మేరకు బిజెపి ఎస్టీ మోర్చ రాష్ట్ర నాయకులు పాయం వెంకయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి మోదుగు పెరమయ్య, పార్టీ మాజీ మండల అధ్యక్షులు డివిఎస్ రమణారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీమతి గంధం జయలక్ష్మి (సొసైటీ డైరెక్టర్), సీనియర్ నాయకులు కట్టం ముత్తయ్య తదితరులు చింతూరులో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆనందాన్ని,హర్షాన్ని వ్యక్తం చేశారు. బిజెపి జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో గత ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు. రాష్ట్రంలో పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు.పేదలకు ఇండ్ల కాలనీల నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో పశువులు, కోళ్లు, గేదెలను పేదలకు ఇస్తుందన్నారు. కొంతమంది తమ ఉనికి కోసం కూటమి ప్రభుత్వంపై నిందలు మోపటం మానుకోవాలన్నారు.ఈ కార్యక్రమం బిజెపి యువ నాయకులు ముటా మల్లేష్, శ్యామల లక్ష్మణరావు, రాజకుమార్,శ్యామల జోగారావు తదితరులు పాల్గొన్నారు.(Story : గిరిజన జిల్లా పోలవరం ఏర్పాటు హర్షనీయం బిజెపి చింతూరు డివిజన్ )

