న్యూ ఇయర్ మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలే దారి
చింతూరు సి ఐ గోపాల కృష్ణ
న్యూస్ తెలుగు/చింతూరు :
నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని, కానీ ఆ ఆనందం ఇతరుల ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదని జిల్లా యస్ పి అమిత్ బర్గర్ ,చింతూరు ఎ యస్ పి హేమంత్ ఆదేశాల మేరకు చింతూరు సిఐ గోపాల కృష్ణ ప్రజలకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి సానుభూతి చూపకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టు వీలర్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తే కేసులు పెడతామన్నారు. అలాగే మితిమీరన వేగం తో ప్రయాణించరాదని, అలా ప్రయాణిస్తే కేసులు పెడతామన్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ముందస్తుగా చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. “సెలబ్రేషన్ కుటుంబంతో, సురక్షితంగా జరుపుకోవాలి. మత్తులో వాహనం నడిపితే నేరమే, శిక్ష తప్పదు”
న్యూ ఇయర్ రాత్రి నుంచి జనవరి 1 వరకు మండల వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.డి జె లకు అనుమతి లేదని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే తక్షణమే అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.
. మహిళలు, యువత, వృద్ధుల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా ముగియాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. మత్తు వద్దు – భద్రత ముద్దు అన్న సందేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని చింతూరు సి ఐ గోపాల కృష్ణ పేర్కొన్నారు (Story:న్యూ ఇయర్ మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలే దారి)

